డబ్బులు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం... ఖాతాల్లో జమ
జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను పరుగులు తీయిస్తోంది. అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు ఈసారి సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చినవాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. వీరికి రావల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయనున్నట్లు ప్రకటించింది.
రూ.55 కోట్ల బిల్లుల చెల్లింపు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ పథకంకింద 18వేల మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోగా అందుకు సంబంధించి రూ.55 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. 2014-19 మధ్య ఇళ్ల నిర్మాణాలు చేపట్టినవారికి బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణశాఖను ఆదేశించారు. ఆ శాఖతో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఎన్ని ఇళ్లు నిర్మించారు? ఎంతమందికి బిల్లుల చెల్లింపు జరిగింది? ఇంకా ఇవ్వాల్సినవి ఎంత? అనే వివరాలను నివేదిక రూపంలో అధికారులు రూపొందించారు.

ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు
ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ఈ పథకాన్ని అనుసంధానించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం లేనివారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద గత టీడీపీ ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందించింది. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో ఒక సెంటు స్థలం ఇచ్చారు.
-
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications