Covid 19: ఏపీలో కోవిడ్ అలర్ట్ ఉపసంహరణ..! టీడీపీ మహానాడు కోసమేనా ?
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారికంగా ఒకటి రెండు కేసులు మాత్రమే కనిపిస్తున్నా తెరవెనుక వీటి సంఖ్య ఎక్కువే ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదు రోజుల క్రితం కరోనా అలర్ట్ ను జారీ చేసింది. ఇందులో గతంలో కరోనా సమయంలో విధించిన ఆంక్షల తరహాలోనే పలు కీలక సూచనలు చేసింది. వీటిని తప్పనిసరిగా పాటించాలని అధికారులకు కూడా ఆదేశాలు పంపింది. అయితే మూడు రోజుల వ్యవధిలోనే దీన్ని వెనక్కి తీసుకుంది.
ఈ నెల 21న ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా చూడాలని, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్టాండ్లలోనూ కరోనా మార్గదర్శకాలు పాటించాలని, వృద్ధులు, గర్భిణీలు కూడా ఇంటివద్దే ఉండాలని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, విదేశాలకు వెళ్లి వచ్చిన వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరినీ కలవకుండా ఇంటివద్దే ఉండాలని కోరింది.

అయితే ఏమైందో ఏమో కానీ మే 24న జారీ చేసిన మరో ఉత్తర్వుల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్.. తమ శాఖ డైరెక్టర్, వైద్యవిద్యాశాఖ డైరెక్టర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కొన్ని కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మే 21న జారీ చేసిన మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లు స్పష్టత కోరారని, దీనిపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారని తెలిపారు.. ఇందులో ఏపీలో 3 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ఇవి కూడా తీవ్రమైనవి కావని వెల్లడించారు.
కేంద్రం కూడా కోవిడ్ పై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని, పరిస్ధితి అదుపులోనే ఉందని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపిందనని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే వైద్యవిద్యాశాఖ డైరెక్టర్ కూడా ఆస్పత్రుల్లో జ్వరం కేసుల్లో పెరుగుదల లేదని తెలిపినట్లు చెప్పారు. తాజా పరిస్దితిని కింది స్ధాయిలో అధికారులు నిశితంగా గమనించి వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కాబట్టి మే 21న జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ తెలిపారు.

కరోనాపై కేంద్రం నుంచి వచ్చే సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇలా కరోనా మార్గదర్శకాలు అర్ధాంతరంగా ఉపసంహరించుకోవడం వెనుక టీడీపీ మహానాడు ఉందన్న చర్చ జరుగుతోంది. కరోనా మార్గదర్శకాలు అమల్లో ఉంటే టీడీపీ మహానాడు నిర్వహణపై ఉల్లంఘన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావించి ఇలా ప్రభుత్వం మూడు రోజుల్లోనే వెనక్కి తగ్గిందా అన్న చర్చ సాగుతోంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications