ఏపీలో ఇక రేషన్ ఇచ్చే తేదీలు, టైమింగ్స్ ఇవే..!

ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో జూన్ నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం ఇకపై ప్రస్తుతం రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలు అదృశ్యం కాబోతున్నాయి. వీటి స్ధానంలో తిరిగి రేషన్ షాపుల వద్దే రేషన్ పంపిణీ చేయబోతున్నారు. ఇలా రేషన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు, సమయాలు ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

రేషన్ పంపీణీని ఇకపై సీరియస్ గా తీసుకుంటున్న ప్రభుత్వం వీటి కోసం రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు, సమయాల్ని కూడా ప్రకటించింది. వీటి ప్రకారమే జూన్ నెల నుంచి బియ్యం కార్డు దారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తేదీ దాటిపోతే సరుకులు తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో రేషన్ కార్డు దారులు కొత్తగా రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు, సమయాల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

ap government s ration distribution dates and timings from june

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకూ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు ఈ రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాల్ని కూడా వెల్లడించింది. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ఈ తేదీల్లో, ఈ సమయాల్లో మాత్రమే రేషన్ పంపిణీ ఉండబోతోంది.

ఇప్పటివరకూ రేషన్ వాహనాల్లో రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ షాపుల్లోనే ఇస్తారు కాబట్టి వాటి తేదీలు, సమయాలను గుర్తుపెట్టుకుని వెళ్లాల్సి తీసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లను ప్రభుత్వం ఈ సమయాలు, తేదీలను లబ్దిదారులకు తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో త్వరలోనే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో లబ్దిదారులను యాడ్ చేస్తారు. ఆ తర్వాత అందులోనే మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే సమాచారం ఇస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+