చవితి వేడుకలు జరుపుకొండి.. కానీ మార్గదర్శకాలకు లోబడే: ఏపీ గవర్నర్, శుభాకాంక్షలు
వినాయక చవితి మండపాల చుట్టూ రాజకీయాలు సాగుతోన్నాయి. ముఖ్యంగా ఏపీలో మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు అని ప్రభుత్వ స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. చవితి మండపాల ఏర్పాటుకు అనుమతివ్వాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీడీపీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా స్పందించారు. వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని అంటూనే ఓ మెలిక పెట్టారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. తాము తలపెట్టిన కార్యక్రమాల విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారని పేర్కొన్నారు.

కరోనా వైరస్ వల్ల అలాంటి పరిస్థితి లేదన్నారు. శాంతి, సామరస్యంతో గడిపేందుకు అవసరమైన శక్తిని జనానికి ప్రసాదించాలని విగ్నేశ్వరుడిని కోరుతున్నానని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు పాటించాలని స్పష్టంచేశారు. ప్రోటోకాల్‌లను విధిగా పాటించాలని తేల్చిచెప్పారు. సకుటుంబ సపరివార సమేతంగా ఇంటి వద్ద ఉండి పండుగ జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు కోరారు. కరోనా వైరస్ నిలువరించటంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని గవర్నర్ కోరారు.
Recommended Video
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications