• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పాలనా వికేంద్రీకరణతోనే న్యాయం: సచివాలయ వ్యవస్థ ఆదర్శం: గవర్నర్ బిశ్వభూషన్..!

|

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తన ప్రసంగంలో గవర్నర్ మూడు రాజధానుల గురించి ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కేబినెట్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. అభివృద్ధి, వికేంద్రీకరణతోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హరిచందన్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీని విలీనం చేసామని.. సుపరిపాలన కోసం స్పందన కార్యక్రమం తీసుకొచ్చమని గవర్నర్ వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పధకాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతోందని, తెలుగును తప్పనిసరి చేసిందన్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ దిశగా..

పరిపాలనా వికేంద్రీకరణ దిశగా..

గవర్నర్ హరిచందన్ తన ప్రసంగంలో ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పరిపాలనా వికేంద్రీకరణ..మూడు రాజధానుల నిర్ణయం పైన ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కేబినెట్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. రాజధాని విధులను మూడు ప్రాంతాల్లో పంపిణీ చేసే నిర్ణయం తీసుకుందని చెప్పారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్‌లో జ్యుడీషియల్‌ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా...ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని కోసమే

కేబినెట్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. వనరుల సమతుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడు తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేసారు. చారిత్రాత్మక దిశ బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ పధకాల గురించి..

ప్రభుత్వ సంక్షేమ పధకాల గురించి..

ప్రభుత్వ ఈ ఏడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేసారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని చెప్పుకొచ్చారు. సుపరిపాలనలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించన్నారు. . ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని, సచివాలయల ఏర్పాటుతో 4లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. రైతు భరోసా పథకం రూ.13,500 మందికి ఇస్తున్నామని, ధరల స్థిరీకరణ కోసం రూ.3 కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు 9గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తోందని, 100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ కంటి వెలుగు, వైఎస్సార్ పింఛను కానుక ద్వారా రాష్ట్ర ప్రజలకు లబ్ది కలుగుతుందని వివరించారు. వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇంగ్లీషు మీడియం ద్వారా పేద విద్యార్దులకు..

ఇంగ్లీషు మీడియం ద్వారా పేద విద్యార్దులకు..

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతోందని, తెలుగును తప్పనిసరి చేసిందన్నారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరుగుతుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగు పరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గవర్నర్ హరిచందన్‌ వ్యాఖ్యానించారు. జగనన్న అమ్మ ఒడితో 100శాతం అక్షరాస్యత సాధించేలా ప్రయత్నం. తెలుగును కొనసాగిస్తూ అన్ని తరగతుల విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా రూపకల్పన చేస్తుందన్నారు. మనబడి నాడు-నేడుతో 45వేల పాఠశాలలు, 471 జూనియర్‌ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్దం అవుతన్నాయన్నారు.. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, సమ దుస్తులు పంపిణీ. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం గురించి వివరించారు. సీఎం జగన్ తో సహా పలువురు రాజకీయ..అధికార ప్రముఖులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

English summary
AP Governor Biswabhushan Harichandan stated three cpaitals decision to do justice for all areas..decentralise the power. In Republic day speech Governor explained govt schemes and results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more