కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ
కరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన నేఫథ్యంలో తన జీతంలో కూడా 30 శాతం స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలని హరిచందన్ నిర్ణయించుకున్నారు.
కరోనాపై పోరుకు ఏపీ గవర్నర్ చేయూత..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తన వంతుగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముందుకొచ్చారు. తన నెల జీతంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వాలని
గవర్నర్ హరిచందన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో తన వంతుగా స్వచ్ఛంద విరాళం ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించారు

రాష్ట్రపతికి లేఖ రాసిన గవర్నర్













Click it and Unblock the Notifications