Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Anandayya మందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్: దానికి మాత్రం నో పర్మిషన్

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి జగన్ సర్కార్ పచ్చజెండా ఊపింది. ఆయన తన వైద్యాన్ని కొనసాగించవచ్చని అధికారికంగా ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు విరుగుడుగా ఆయన ఇచ్చే వైద్యాన్ని ఇష్టమైన వారు స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య ఇచ్చే మందు హానికరం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. మందును తయారు చేసే ప్రక్రియలో ఆనందయ్య.. పేషెంట్ల శరీరానికి హాని కలిగించే లేదా అనారోగ్యానికి గురి చేసే పదార్థాలను వినియోగించట్లేదని తేటతెల్లం చేసింది.

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఎఎస్) చేసిన సిఫారసుల మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నెల్లూరు జిల్లా కృష్టపట్నానికి చెందిన ఆనందయ్య.. కరోనా వైరస్‌కు విరుగుడుగా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం పలు జిల్లాల నుంచి కరోనా వైరస్ బంధువులు, సాధారణ ప్రజలు కృష్ణపట్నంలో బారులు తీరుతున్నారు. రోజూ వందలాది మందికి ఆయన ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తోన్నారు.

 AP govt allows Anandayya herbal medicine after CCRAS report

దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. నిపుణుల కమిటీని పంపించింది. మందును తయారు చేయడానికి ఆనందయ్య వినియోగించే పదార్థాలు, తయారైన మందు శాంపిళ్లను సేకరించిందా కమిటీ. దీనిపై తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ మందును పంపిణీ చేయొద్దని ఆనందయ్యను ప్రభుత్వం ఆదేశించింది. ఆ శాంపిళ్లను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌కు పంపించింది.

అన్ని కోణాల్లోనూ ఆ నమూనాలను పరిశీలించిన తరువాత.. అందులో హాని కలిగించే పదార్థాలేవీ లేవని సీసీఆర్ఏఎస్ నిర్ధారించింది. ఆ మందు పంపిణీకి అనుమతి ఇవ్వొచ్చిన ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని తీసుకుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. కంట్లో వేయడానికి ఉద్దేశించిన చుక్కలను మాత్రం నిషేధించింది. కంట్లో ఎలాంటి మందును వేయకూడదని ఆనందయ్యకు సూచించింది.

Recommended Video

    Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+