నామినేటెడ్ పదవుల ఖరారు - ఎవరికి ఏ పోస్టు..!!

ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు 23 వేల మంది నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసారు. పదవుల పంపకాల పైన పవన్, పురందేశ్వరితో చంద్రబాబు చర్చించారు. దశల వారీగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్నికల్లో సీట్లు దక్కని టీడీపీ సీనియర్లకు కీలక పదవులు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

కసరత్తు
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పైన కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన పైన దాదాపు కసరత్తు పూర్తయింది. మూడు పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ లో సీనియర్లతో పాటుగా జనసేన, బీజేపీలోని ముఖ్యులకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుందని చెబుతున్నారు. అదే విధంగా బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు ఈ విడతలోనే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.

AP Govt almost finalised nominated posts for senior leaders details here

పదవులు
టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం. దేవినేని ఉమాకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాబికి పౌర సరఫరాల కార్పోరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అమరావతి అమరావతి కి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

టీటీడీ బోర్డు
రాష్ట్రంలో 90 వరకూ కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 30 శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. ఇక, టీటీడీ బోర్డు ఏర్పాటు పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ ఛైర్మన పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ తో పాటుగా మరో మూడు రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో అవకాశం కల్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+