రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం దీపావళి కానుక - బియ్యంతో పాటు ఇక ఇవన్నీ..!!
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బహిరంగ మార్కెట్ లో బియ్యంతో పాటుగా నిత్యవసర ధరలు పెరిగిన వేళ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సమయంలో రేషన్ లబ్దిదారులకు తక్కువ ధరలకే నిత్యవసరాలు అందించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రకాల వస్తువులను అందుబాటులో ఉంచ టంతో పాటుగా వాటి ధరలను ఖరారు చేసారు. ఈ నిర్ణయం లబ్దిదారులకు మేలు చేయనుంది.
ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా పై కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా ప్రజలకు అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ధరల పెరుగుదల వేళ సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ తక్కువ ధరలకే అందించనున్నారు. ప్రస్తుతం ఎల్‌నివో ప్రభావం వల్ల పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో బయట మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. ఇవి సామాన్యులకు భారంగా మారాయి. దీంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా రేషన్ షాపుల్లో ఎంపిక చేసిన నిత్యావసరాలను తక్కువ ధరకే పంపిణీ చేయనున్నారు.

పెరిగిన ధరల వేళ ప్రభుత్వ నిర్ణయం
సామాన్యుల పై భారం లేకుండా వీటి ధరలను ఖరారు చేసారు. కిలో కందిపప్పు రూ.100 గా ఫిక్స్ చేసారు. అదే విధంగా గోధుమ పిండి రూ.25, పామాయిల్ లీటర్ రూ.125కే ఇవ్వనున్నారు. టెండర్ల ద్వారా పామాయిల్ సేకరించి పంపిణీకి ప్రభుత్వం సిద్దం అవుతోంది. కాగా, ఫైన్, సూపర్ ఫైన్ రకం బియ్యంను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు అందించేందుకు రంగం సిద్దం చేసారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ.100 పలుకుతోంది. దీంతో మొబైల్ వాహనాల ద్వారా ధరణి బ్రాండ్‌తో కిలో పైన్ బియ్యాన్ని రూ.49, సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.50కే విక్రయించనున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో సన్నబియ్యంను ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వం అందిస్తోంది. అలాగే కిలో ఉల్లిని రూ.35కే పంపిణీ చేస్తోంది. త్వరలో 800 టన్నలు ఉల్లిని కూడా సబ్సిడీ ధరలకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
