ముంచుకొస్తున్న మరో ముప్పు, అల్పపీడనం - ఈ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు..!!
ఆర్నాబ్ తుఫాను దెబ్బకు పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షం, ప్రచండ ఈదురుగాలులతో గోదావరి జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. ఉత్తరాంధ్ర చిగురాటుకులా వణికింది. తుపాను వల్ల కోనసీమకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సహాయం ప్రకటించింది. కాగా.. వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆర్నాబ్ నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచి ఉంది. పలు జిల్లాలకు భారీ వర్షాల పై హెచ్చరిక చేసింది.
అర్నబ్ తుపానుతో పలు జిల్లాలు దెబ్బ తిన్నాయి. కుండపోత వానలతో, రాకాసి గాలుల బీభత్సం తో పలు జిల్లాలు కకావికలం అయ్యాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు, గెడ్డలు పొంగి రహదారు లను ముంచెత్తడంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయింది. ఉభయ గోదావరి జిల్లాలను ఈదురు గాలులు భారీ నష్టం మిగుల్చాయి. 3 లక్షలకు పైగా హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారు లు ప్రాథమికంగా అంచనావేశారు. రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. పార్వతీపురం మన్యం ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగడంతో పంటలు ముంపునకు గురయ్యాయి. నష్టం జరిగిన వారికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది.

అండమాన్ లో అల్పపీడనం
కాగా.. ఆర్నాబ్ నష్టం అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ సమయంలోనే దక్షిణ అండమాన్ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో గురువారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వచ్చేనెల 2 నాటికి ఉత్తర కోస్తాకు సమీపంగా రానుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే ఇది అల్పపీడనం నుంచి వాయుగుండంగా బలపడుతుందా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అండమాన్ సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడినా, లేకపోయినా ఉత్తర కోస్తా దిశగా వస్తుందని, దీంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల కోస్తాలో ముఖ్యంగా మధ్య కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో.. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా యంత్రాంగం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.













Click it and Unblock the Notifications
