చొక్కా పైకి మడిచాం, జగన్ కు చెక్ పెడతాం- పులివెందులలో ఆది హెచ్చరిక..!!
పులివెందులలో రాజకీయం వేడి పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ సవాళ్లు .. ప్రతి సవాళ్లు ఉత్కంఠగా మారుతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ ఏకగ్రీవాలు వైసీపీ- టీడీపీ మధ్య ప్రతిష్ఠాత్మకం అయ్యాయి. పులివెందుల కేంద్రంగా మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రత్యర్థులకు హెచ్చరిక చేయటం సంచలనంగా మారింది. ఇప్పుడు అదే పులివెందులలో ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
స్థానిక ఎన్నికలు కడప జిల్లాలో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. 2021 లో జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీనికి కౌంటర్ గా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో జగన్ సొంత నియోజకవర్గం పులి వెందుల లోనూ అదే విధంగా గెలవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం చేసుకుంది. ఇక.. కడప కార్పోరేషన్, పులివెందుల మున్సిపాల్టీలోనూ పలు వార్డులు టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. దీంతో.. కడప కార్పోరేషన్ తో పాటుగా పులివెందుల మున్సిపాల్టీలను దక్కించుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే జగన్ కు సవాల్ గా మారింది. దీంతో.. తాజాగా పులివెందులలో పర్యటించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలింగ్ రోజున తాను అక్కడే ఉంటానని.. అన్యాయం చేసేందుకు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. చొక్కా స్లీవ్స్ మడత పెట్టామని.. ఎంత మంది వస్తారో రావాలని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఉత్కంఠగా మారుతున్న పులివెందుల ఎన్నికలు
దీంతో.. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలతో పులివెందులలో బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ప్రచారంలో భాగంగా స్పందించారు. జగన్ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అన్నారు. అయిదేళ్ల ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు తమ పై ఆరోపణల ను చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి అభ్యర్ధులు కరువై నామినేషన్లు వేయలేదని చెప్పారు. దానికీ, మాకు ఏం సంబంధం? జగన్ హయాంలో అరెస్టులు, వేధింపులు, దాడులు చేశారని.. జగన్ తాజా వ్యాఖ్యలకు సమాధానం చెప్పే సమయం వచ్చినపుడు చేతలతోనే సమాధానం చెబుతామన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్.. పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టారా అన్ని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి చొక్కా మోచేతి కిందికి మడిచాడు..మేము మోచేతి పైకి మడిచాం..ఆయనకు చెక్ పెట్టడానికి వచ్చాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. దీంతో.. పులివెందులలో పోలింగ్ వేళ రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
