Cyclone Arnab: అర్నాబ్ ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు!

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌ను అర్నాబ్ తుఫాన్ అల్లకల్లోలం చేస్తోంది. తుఫాన్ తీరం దాటడంతో గాలులు భారీగా వీస్తుండటంతో చాలా చెట్లు కూలడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కారు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులను పొడిగించింది. మంగళ, బుధవారాలతో పాటు గురువారం కూడా సెలవు ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Cyclone Arnab: అంతర్వేదీ తీరంలో సల్ఫర్ నౌక కలకలం.. తుపాను ప్రభావంతో ఒడ్డుకు
Cyclone Arnab: అంతర్వేదీ తీరంలో సల్ఫర్ నౌక కలకలం.. తుపాను ప్రభావంతో ఒడ్డుకు

ఏపీలో 8 మంది దుర్మరణం
ఈ తీవ్ర తుఫాన్ అర్నాబ్ ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున నర్సాపూర్, యానాం, కాకినాడ, సమీపంలో తీరం దాటిన ఈ తుఫాన్ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాన్ ధాటికి తీరప్రాంత జిల్లాల్లో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు దెబ్బతిని, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా స్తంభించిపోయాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు తీర ప్రాంతాల నుంచి 20,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Arnab Havoc in Andhra Pradesh 8 Dead Schools and Colleges Closed Today in Affected Districts

వేర్వేరు జిల్లాల్లో ప్రమాదాలు
తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చెట్టుకూలి సీహెచ్ కిషోర్(45) అనే వ్యక్తి మరణించగా.. విద్యుత్ స్తంభం పడి రాంబాబు అనే మరో వ్యక్తి మృతి చెందారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో పూరిపాక కూలి కె.వెంకాయమ్మ అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా.. ప్రకాష్‌పురంలో మరో మహిళ మృతి చెందింది. విశాఖపట్నం నగరంలో గోశాల, బాలాజీ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి కె.మాధవితో పాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. మంగళపాలెం ప్రాంతంలో కరెంట్ తీగ తగిలి ఎ.పిన్ని దేవుడు(65) అనే వ్యక్తి మృతి చెందారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టౌన్‌లో ఇంటి బయట ఉన్న తెగిపడిన విద్యుత్ తీగను అనుకోకుండా తొక్కి 55 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

తీవ్ర వాయుగుండంగా అర్నాబ్..! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ..!
తీవ్ర వాయుగుండంగా అర్నాబ్..! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ..!

రికార్డు స్థాయి వర్షపాతం
బుధవారం ఉదయం 2 గంటల నుంచి 8 గంటల మధ్య గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో అర్నాబ్ తుఫాన్ తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గారివిడిలో అత్యధికంగా 26 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. అనకాపల్లి, ఎస్,కోట, వేపాడ, చీపురుపల్లి ప్రాంతాల్లో 25 సెంటిమీటర్లు, భీమిలి, యలమంచిలి, మెంటాడల్లో 24 సెంటిమీటర్ల వర్షపాతం పడింది. విశాఖ పట్నంలో 20 సెంటిమీటర్లకు పైగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయయయ్యాయి.

పంటలకు తీవ్ర నష్యం
కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోనసీమ జిల్లాలో వరి పంటలు నీటమునిగినప్పటికీ. వాణిజ్య పంట అయిన కొబ్బరి తోటలకు పెద్దగా నష్టం వాటిల్లకపోవడం కాస్త ఉపశమనం కలిగించింది. కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరప్రాంత రహదారి పూర్తిగా సముద్ర కోతకు కొట్టుకుపోయింది.

కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు
పరిస్థితి తీవ్రతపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అందించారు. రాష్ట్రానికి కేంద్ర సర్కారు తక్షణ సాయం అందించాలని కోరారు. కాగా రాబోయే 48 గంటల్లో ఈ తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలహీనపడుతుందని, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వరుసగా టెలీకాన్ఫరెన్సులు కూడా నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+