ఆ విద్యార్ధులకు రూ 25 లక్షల సాయం, మార్గదర్శకాలు - ఏపీ ప్రభుత్వం ప్రకటన..!!

ap-govt-announces-implementation-of-overseas-vidya-nidhi-scheme-for-eligible-students-here-the-det
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధులకు ఆర్దికంగా సాయం అందించాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక అయిన విద్యార్దులకు రూ 25 లక్షల వరకు ఆర్దిక సాయం అందించే లా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సడలించి.. టాప్ 250 యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ పథకం అమలు కానుంది.

ఏపీ ప్రభుత్వం విదేశాల్లో చదివే విద్యార్ధుల కోసం కీలక నిర్ణయం ప్రకటించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్దులకు ఆర్దిక సాయం అందించేలా కొత్త పథకం అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వివరాలను వెల్లడించారు. గతంలో ఉన్న పరిమితులను సడలించి, ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. చదువులో రాణించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన విద్యార్ధులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?
మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?
ap-govt-announces-implementation-of-overseas-vidya-nidhi-scheme-for-eligible-students-here-the-det

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 లక్షల రూపాయలు, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు అందుతాయి. ఈబీసీ, కాపు వర్గాల విద్యార్థులకు 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిర్వహణ ఖర్చుల కింద అదనంగా 5 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులకు ఈ సాయం వర్తిస్తుంది. గతంలో ఉన్న క్యూఎస్ ర్యాంకింగ్ నిబంధనలను సడలించి, టాప్ 250 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి కూడా సాయం అందించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువమంది విద్యార్థులు విదేశీ విద్యను పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పూర్తి విధి విధానాలతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+