ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల ఖరారు..!!

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల పైన కొనసాగుతున్న సందిగ్ధత పై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, సెలవులు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారా సాగింది. కానీ, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే సెలవులను నిర్దారించింది. ఇదే సమయంలో సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి వేళ ఆరు రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14న భోగి పండగ (ఆదివారం), జనవరి 15న సంక్రాంతి పండగ వచ్చింది. అలాగే జనవరి 16,17,18 వ తేదీ వరకు సెలవులను ఖరారు చేసారు. తొలుత 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించినా... స్కూళ్లు, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నంగా సెల‌వులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

AP Govt Announces Pongal Holidays for Educational institutions from January 9th to 18th

కాగా.. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఏపీలో పల్లెల్లో సంక్రాంతి సందడి ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ప్రతీ ఏటా కొనసాగుతోంది. గ్రామాల్లో సంక్రాంతి వేళ నిర్వహించే కోళ్ల పందాలు ప్రత్యేకార్షణగా ఉంటాయి. నగరాల నుంచి సొంత గ్రామాలకు ఈ పండుగ వేళ చేరుకొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సారి కూడా అదే సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీకి వచ్చే ప్రత్యేక రైళ్లు, బస్సులు నిండుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+