ఏపీలో ఇక వారికి ఉచితం - ప్రభుత్వ నిర్ణయం, మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి చేనేత కార్మికుల నివాసాలకు నెలకు రూ 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త పథకం అమలు దిశగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని కారణంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత వర్గాలకు మేలు జరగనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసారు.
ఏపీలో చేనేత వర్గాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు.. పవర్ లూమ్స్ కు 50 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 93 వేల చేనేత కుటుంబాలకు వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదే విధంగా 10 వేల 534 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుం దని భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయనుంది.

ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చేనేత, టెక్స్‌టైల్స్ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హామీ ఇచ్చింది. జీఎస్టీ రద్దు కోసం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తాజాగా విద్యుత్ రాయితీ విషయంలో ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించినా, లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది.
దీని ప్రకారం చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించినట్లయితే, 200 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రమే డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా పవర్ లూమ్స్ విషయం లోనూ నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications