సింఘాల్ పై వేటు - TTD నూతన ఈవోగా CMO అధికారి..!!

TTD: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణ చేస్తున్న సిట్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో గతంలో ఈవోగా పని చేసిన సమయంలో అనిల్ కుమార్ సింఘాల్ పైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. దీంతో, ఇప్పుడు సింఘాల్ ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.

టీటీడీ లో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా కావడానికి టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తెచ్చిన మార్పులే కారణమని దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. అప్పటి, ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించకపోవడం లేక గుర్తించినా చూసీ చూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్‌ ఆక్షేపించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. దీంతో.. అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫారసు చేసింది. దీంతో, అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏఈవో వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని నిర్దేశించింది.

ap-govt-appoints-muddada-ravichandra-as-new-eo-for-ttd-in-place-of-anil-kumar-singhal

ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు

కాగా, అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో టీటీడీ నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవి చంద్రను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రవిచంద్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూనే ముద్దాడ ను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న ముద్దాడకు ఇప్పుడు టీటీడీ ఈవోగా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఈవోగా శ్యామలా రావు పని చేసారు. అప్పట్లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. కల్తీ నెయ్యి ఘటనల తరువాత శ్యామల రావును ప్రభుత్వం బదిలీ చేసింది. సింఘాల్ ను నియమించింది. ఇప్పుడు సిట్ నివేదిక ఆధారంగా సింఘాల్ ను తప్పించి ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు కేటాయించింది. త్వరలోనే ముద్దాడ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో, సీఎంఓలోనూ కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+