ఎస్సీ వర్గీకరణ పై చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ఎస్సీ వర్గీకరణ అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏక సభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేసి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేందుకు 60 రోజుల గడువు నిర్దేశిస్తూ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.

AP govt appoints one-man commission on sub-classification within SC reserved categories

60 రోజుల సమయం
వర్గీకరణ పై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేసారు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది. జనాభా గణన పరిగణనలోకి తీసుకోవటంతో పాటుగా.. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటం పైన సూచనలు చేయాలి. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

వర్గీకరణ కు వీలుగా
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉప కులాలకు సమానంగా అందేలా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు నెలల సమయం ప్రభుత్వం నిర్దేశించింది. మాజీ ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ మేరకు అధ్యయనం చేయటంతో పాటుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+