APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు, ఆ నిధులు విడుదల..!!
APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులకు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం కింద నిధులను తిరిగి చెల్లించింది. SRBS సభ్యులై పొదుపు చేసిన ఉద్యోగుల డబ్బును వాపస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులను విడుదల చేసింది. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది.
ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. APSRTC లోని ఎస్ఆర్బీఎస్ సభ్యులై పొదుపు చేసిన ఆర్టీసీ ఉద్యోగుల డబ్బు వాపస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2030 మే నెల వరకు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులుకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా 8450 మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ. 75 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. రిటైర్మెంట్ తర్వాత పింఛన్ కోసం SRBS ను ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ వచ్చారు. కాగా.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయిన తరువాత ఈ విధానం నాటి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, తాము పొదుపు చేసిన మొత్తం తిరిగి ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పుడు ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకొని.. నిధులు విడుదల చేసింది.

కొత్త పోస్టుల భర్తీ పై కసరత్తు
ఇక, ఆర్టీసీలో ఖాళీల భర్తీ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరేందుకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు అన్ని శాఖల ఖాళీలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రవాణ మంత్రి సూచించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్యత క్రమంలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020లో ఆర్టీసీలో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది కొనసాగుతున్నారు. ఇక, వచ్చే మూడేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో.. రవాణా సేవలకు ఇబ్బంది లేకుండా ఖాళీల భర్తీ పైన ఆర్టీసీ - ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications