ఏపీ మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ - ముహూర్తం, హాల్ట్స్, టికెట్ ధరలు..!!
రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. రెండో వందేభారత్ రైలు పైన మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు. ఈ ఏడాది జనవరిలో తొలి వందేభారత్ స్లీపర్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రెండో రైలు పైన కొంత కాలంగా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రైల్వే మంత్రి అధికారికంగా ఈ రైలు ప్రారంభం పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ ప్రకటన ద్వారా ఎనిమిది గంటల వరకు ప్రయాణ సమయం కలిసి రానుంది. రూట్ తో పాటుగా హాల్టింగ్ స్టేషన్ల పైన స్పష్టత వచ్చింది.
రైల్వే మంత్రి రెండో వందే భారత్ స్లీపర్ ప్రారంభం పైన స్పష్టత ఇచ్చింది. వందేభారత్ స్లీపర్ పైన ప్రయాణీకుల్లో అంచనాలు పెరుగుతున్న వేళ.. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రారంభానికి నిర్ణయించారు. ఈ రెండో రైలు ముంబాయి - బెంగళూరు మధ్య ప్రకటించారు. ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ స్లీపర్ ఏర్పాటు చేయాలని బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్‌కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. ఈ లేఖలో విషయాన్ని ప్రస్తావించారు. దూరపు ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది. అదే విధంగా ప్రస్తుతం ముంబాయి నుంచి ప్రధాన రైళ్లు బెంగళూరు కు కొనసాగుతున్న మార్గంలోనే ఈ రైలు నడవనుంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగనుంది.

వందేభారత్ స్లీసర్ రూటు.. టికెట్ ధరలు
కాగా, ఈ రైలుకు అనంతపురం, హిందూపూర్ లో హాల్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. ఈ రైలుకు సంబంధించి షెడ్యూల్, టికెట్ ధరలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెల అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఈ రైలు పట్టాలెక్కనుంది. అదే విధంగా మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అటు కొత్తగా ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, అమృత్ భారత్ ఏసీ కోచ్ లను ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలును విశాఖ నుంచి తిరుపతి, లేదా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వందేభారత్ స్లీపర్ తో పాటుగా అమృత్ భారత్ రైలు పైన ప్రకటన రానుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఎలాంటి రాయితీలు ఉండవు. ఎవరైనా పూర్తి ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కిలోమీటర్‌కు రూ.2.40 నుంచి రూ.3.80 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. వీటిల్లో మొత్తం 16 కోచ్‌లు ఉంటుండగా.. 823 మంది ప్రయాణికుల వెళ్లే సామర్థ్యం ఉంటుంది.












Click it and Unblock the Notifications