డీఎస్సీ నోటిఫికేషన్, వయోపరిమితి పై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసేదీ క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా డీఎస్సీ అభ్యర్ధుల వయో పరిమితి పెంపు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల తొలి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తొలుత ప్రకటన చేసారు. కానీ, ఇప్పుడు వాయిదా పడింది. ఇక, ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల భర్తీ పైన మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం డీఎస్సీ పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీ నిర్వహణ పైన తొలి సంతకం చేస్తామని చెప్పుకొచ్చింది. డీఎస్సీ పోస్టుల భర్తీ పైన సంతకం సైతం చేసారు. కానీ, డీఎస్సీ నిర్వహణ పైన ఈ నెల తొలి వారంలో విడుదల చేస్తామని చెప్పిన నోటిఫికేషన్ వాయిదా పడింది. ఇదే అంశం పైన ఈ రోజు మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు.

AP Govt begin exercise for increase Age limit for DSC candidates details here

ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా డీఎస్సీ ప్రక్రియని చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు లోకేష్ వివరించారు. గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా డీఎస్సీ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 12, 2024 న డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారని, అది కూడా 6100 పోస్టులకు నోటిఫై చేసినట్లు గుర్తు చేసారు. డీఎస్సీ అభ్యర్దుల వయో పరిమితి వ్యవహారం పై ముఖ్యమంత్రి తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై డీజీపీ తో చర్చిస్తున్నామన్న లోకేష్ వాటిని కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+