ఉపాధ్యాయుల బదిలీలు, తుది జాబితా- మార్గదర్శకాలు

ఏపీ ఉపాధ్యాయుల బదిలీల పైన కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే నెలలో బదిలీలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారు అవుతోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటి కే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. జీవో-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై అభిప్రాయ సేకరణ చేసారు. ఉపాధ్యాయుల సీని యార్టీ జాబితా ఈ నెల 20న ఖరారు చేయనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి.

బదిలీల పై నిర్ణయం
ఉపాధ్యాయుల బదిలీలు వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఈ బదిలీలకు సంబంధించి ఇప్ప టికే ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం మేరకే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఆదర్శ ప్రాధమిక పాఠశాల విధానంకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి అయిదో తరగతులకు అయిదు గురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ap-govt-begin-exercise-on-teachers-transfers-guide-lines-almost-finalised

సీనియార్టీ తుది జాబితా
ఇక, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ జాబితా ను విడుదల చేయటంతో పాటుగా అభ్యంతరాలను స్వీకరించారు. పూర్తి స్థాయిలో సరి చేసిన తరువాత తుది జాబితాలను విడుదల చేస్తారు. మరోపక్క ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆదర్శ పాఠశాలల కు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే పోస్టులను మార్పు చేస్తారు. దీనిపైన ఆర్థిక శాఖ అనుమతితో పాఠశాలల్లో పోస్టులపై వచ్చిన స్పష్టత ఆధారంగా బదిలీలు చేపడతారు. మే తొలి వారంలో బదిలీల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం విధానపరమైన ప్రక్రియ ఆన్ లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు.

Take a Poll

మార్గదర్శకాలు
ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. అందులో భాగంగా ఖాళీల ఆధారంగా ఎంపికలను నమోదు చేసుకోవాలి. ఒక టీచర్‌ ఎన్ని ఖాళీలకైనా ఆప్షన్స్​ పెట్టు కొనే వెసులుబాటు కల్పిస్తోంది. వారి సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయి స్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారు తమకు నచ్చిన వాటితోపాటు తమ పాఠశాలను కూడా ఎంపిక చేసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా ఎస్జీటీలకు బదిలీలు నిర్వ హించేలా కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డీఎస్సీలో వచ్చే కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియను మే 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+