అమరావతి పరిధిపై కీలక నిర్ణయం - ఇక ఇలా..!!
ఏపీ రాజధాని అమరావతి పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తిరిగి నిర్మాణా ల ప్రారంభం కోసం ముహూర్తం ఖరారు చేసింది. కొత్త టెండర్లను ఖరారు చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఖరారు కావటంతో ఆర్దికంగా ఇబ్బందులు ఉండవని భావిస్తోంది. ఇదే సమయంలో సింగపూర్ భాగస్వామ్యం పునరుద్దరణకు కేంద్రం అను మతి కోరింది. ఇప్పడు అమరావతి పరిధి మరింత పెంచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కసరత్తు
అమరావతి నగర పరిధిని మరింత పెంచే అంశం పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం ఉండాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతిపాదిత నగరాన్ని 534 కి.మీకు విస్తరించాలని భావిస్తున్నారు. మంగళగిరి, విజయవాడలతో పాటు గుంటూరు, తెనాలి నగరాలను కూడా రాజధానికి అనుసంధానం చేయనున్నారు. ఈ నగరాల విలీనంతో భవిష్యత్‌లో భారీ మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ప్రణాళికలు ఖరారు
అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన పనులను తొలి విడతలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు కనీసంగా రెండున్నర సంవత్సరాల కాలపరిమితి ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పూర్తి చేయాలని భావిస్తున్న పనులతో పాటుగా అమరావతి పరిధి విస్తరణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. చుట్టుపక్కల నగరాలను రాజ ధానిలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. రాజధానిలో సదుపాయాల కల్పన, రెండో విడతలో చుట్టుపక్కల నగరాల అభివృద్ధి అనుసంధానం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుమతి వచ్చింది. దీంతో, పూర్తిగా రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు.
పరిధి పెంపు
సీఆర్డీఏ పరిధిలో అమరావతి, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లు కలిస్తే 411 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. దీనికి 61 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విజయవాడ, 65 చదరపు కిలోమీరట్ల పరిధిలో ఉన్న గుంటూరు కూడా కలిపితే సుమారు 530 చదరపు కిలోమీటర్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో, కొత్త రైల్వేలైను ప్రధాన జంక్షన్‌ను నంబూరు వద్ద పెట్టేలా ప్లాను రూపొందించారు. భవిష్యత్ లో రానున్న అవసరాలు.. కావాల్సిన సదుపాయాలకు అనుగుణంగా రాజధాని విస్తరణ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications