పవన్, లోకేష్ శాఖలకు కేటాయింపులు ఎంత..!!

ఏపీ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో కేటాయింపులను సభ ముందు ఉంచారు. తమ ప్రభుత్వం అభివృద్ధి - సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఆర్దికంగా రాష్ట్రం దెబ్బ తిందని వివరించారు. అదే సమయంలో ఈ బడ్జెట్ లో ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్... లోకేష్ నిర్వహిస్తున్న శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.

బడ్జెట్ ప్రాధాన్యతలు
ఏపీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ లో సంక్షేమ, విద్య, గ్రామీణ రంగాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. ప్రధానంగా సంక్షేమ రంగంలో బీసీ సంక్షేమం కోసం రూ.39,007 కోట్లు
కేటాయించిన ప్రభుత్వం.. ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు, మైనార్టీ సంక్షేమం - రూ.4,376 కోట్లు, మహిళ, శిశుసంక్షేమం - రూ.4,285 కోట్లు ప్రతిపాదించింది. సంక్షేమ రంగంతో పాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి మంత్రి పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.

AP Govt Budget Allocation for Education and panchayat Raj details here

పవన్ శాఖలకు కేటాయింపులు
ఇక, డిప్యూటీ సీఎం పవన్ నిర్వహిస్తున్న శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కింది.
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ లో రూ.16,739 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా పవన్ ఆధ్వర్యంలోనే ఉన్న మరో రెండు శాఖలు పర్యావరణం, అటవీశాఖ కోసం రూ.687 కోట్లు కేటాయింపులు చేసారు. గత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని విస్మరించిందని పదే పదే విమర్శిస్తున్న పవన్.. తన హయాంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. అదే విధంగా బడ్జెట్ కసరత్తు సమయంలోనూ పవన్ తన శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు చేసారు. పవన్ చేసిన ప్రతిపాదనల మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు.

లోకేష్ శాఖలకు
ఇక, కేబినెట్ లో కీలకంగా ఉన్న లోకేష్ నిర్వహిస్తున్న శాఖలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కింది. లోకేష్ మానవ వనరుల శాఖ నిర్వహిస్తున్నారు. ఈ శాఖ పరిధిలోని పాఠశాల విద్యాశాఖ కోసం బడ్జెట్ లో రూ.29,909 కోట్లు ప్రతిపాదించగా..ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ - రూ.1,21,5 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోగ్య శాఖకు రూ 18,421 కోట్లు కేటాయింపులు చేసారు. ఇక, మంత్రి నారాయణ శాఖ పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490 కోట్లు, జలవనరుల శాఖకు రూ.16,705 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+