ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నియామకం పైన కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ ప్రతీ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ హయాంలో కొందరు కీలక అధికారుల పైన ఊహించని నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నాడు జగన్ హయాంలో డిమోషన్ కు గురై.. ఆ తరువాత జగన్ పైన తీవ్ర విమర్శలు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పైన కసరత్తు చేస్తోంది. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు కొత్త కమిషనర్ ను నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించి న నీలం సాహ్ని పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. లేదా, సీనియర్ అధికారిగా పని చేసిన వారికి ఈ హోదా కల్పిస్తారు. జగన్ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పని చేసిన నిమ్మగడ్డ ప్రసాద్ తో ఓపెన్ గా విభేదాలు కొనసాగాయి. దీంతో.. నిమ్మగడ్డను తప్పించే క్రమంలో న్యాయపరంగానూ వివాదం కొనసాగింది. కరోనా వేళ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మొదలైన ప్రభుత్వం వర్సస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదం చాలా కాలం కొనసాగింది. ఇక.. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ ల పేర్లు పరిశీలన చేస్తుందని తెలుస్తోంది. అందులో ఒకరు నీరభ్ కుమార్ ప్రసాద్ కాగా, మరొకరు మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.

నాడు సీఎఎస్ పదవి నుంచి తప్పించిన సీఎస్
2019 ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం ను ఎన్నికల సంఘం ఏరి కోరి ఇంఛార్జ్ సీఎస్ గా నియమించింది. ఆయన సీఎస్ గా ఉన్న సమయంలోనే ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత ఆయన్నే సీఎస్ గా కొనసాగించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు.. సీఎంఓ లోని ఒక అధికారితో మొదలైన వివాదం... జగన్ ఆగ్రహంతో ఆకస్మికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించారు. ఆయనకు డిమోషన్ ఇచ్చారు. దాంతో ఆయన చాలా ఆవేదన చెందారు. ఇక తన రిటైర్మెంట్ దాకా చూసి పదవీ విరమణ చేసారు. ఆ తరువాత పలు సందర్భాల్లో జగన్ నిర్ణయాలను ఓపెన్ గా విమర్శించారు. ఇక.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎల్వీ సుబ్రమణ్యం కు ఎన్నికల కమిషనర్ గా పదవి ఇవ్వటం ద్వారా జగన్ అవమానించిన అధికారికి తగని గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం చివరకు ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications