కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, అక్రమాలు నిలదీసినందుకే జైలుకు తరలింపు: బుద్దా, గద్దె
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. సౌమ్యుడైన రవీంద్రపై కావాలనే అభియోగం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. గురువారం బందర్‌లో కొల్లు రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.

కావాలనే ఇరికించి..
భాస్కర్ రావు హత్యకేసులో రవీంద్రను కావాలనే ఇరికించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తమకు అనుమానం ఉందన్నారు. కొల్లు రవీంద్రకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంతేకాదు అతని కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది అని గుర్తుచేశారు.

సౌమ్యుడు..
ఇప్పుడే కాదు గతంలో కూడా కొల్లు రవీంద్రపై ఆరోపణలు లేవు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సౌమ్యుడు అని.. ఐదేళ్లు మంత్రిగా పనిచేసినా.. ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. అలాంటి వ్యక్తిపై హత్యాభియోగం మోపడం దారుణన్నారు. కొల్లు రవీంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాయం జరిగితే నిలదీసినందుకే రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి.. జైలుకు తరలించారని విరుచుకుపడ్డారు.
Recommended Video

ప్రశ్నిస్తే.. కేసులు
రాష్ట్రంలో ప్రశ్నించే వారిని ప్రభుత్వం కక్షసాధిస్తోందని వెంకన్న అన్నారు. ఇది సరికాదు అని.. అక్రమ కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరం చేసిన వారికి శిక్ష విధిస్తే ఓకే కానీ.. అన్యాయంగా కేసులలో ఇరికించడం సరికాదన్నారు. స్థానిక మంత్రి ఒత్తిడితో కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారి కుట్రలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని బుద్దా వెంకన్న తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications