భారీగా కొత్త పెన్షన్ల మంజూరు, తొలుత వీరికే- దరఖాస్తులు.. పంపిణీ ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న లబ్ది దారులకు తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్ల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తుది మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. దరఖాస్తులు... పరిశీలన.. పంపిణీ ముహూర్తం పైనా తాజా గా నిర్ణయం తీసుకుంది. దీంతో.. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కొత్త పెన్షన్ల వ్యవహారం పైన ప్రభుత్వ నిర్ణయంతో లబ్దిదారులకు ఊరట కలగనుంది.
ఏపీ ప్రభుత్వం కొత్తగా పెన్షన్ల మంజూరు పైన నిర్ణయానికి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పెద్ద సంఖ్యలో లబ్ది దారులు కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారు. దీంతో.. ఈ అంశం పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మూడు లక్షల పెన్షన్ల మంజూరు కు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి వద్ద వీటిని అందిస్తోంది. వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులకు అక్టోబర్‌లో పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే దీనికి సంబంధించి సెర్ప్ అధికారులు పూర్తి కసరత్తు చేసారు. సెప్టెంబర్ 2న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ కొత్త పెన్షన్ల కు సంబంధించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.

దరఖాస్తులు.. పంపిణీ ముహూర్తం
రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారం మేరకు 1,70,000 మంది వితంతు వులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో 1,50,000 మంది అర్హులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదే విధంగా చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తి పరమైన పింఛను కేటగిరీ వివరాలను సేకరిస్తున్నారు. ఇవి మొత్తం దాదాపు 70 వేల వరకు ఉండే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. దీంతో.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చసిన తరువాత ఎంపికయ్యే అర్హుల సంఖ్యకు అనుగుణంగా వీరికి పింఛను మంజూరు చేయాలని భావిస్తున్నారు. దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారి విషయంలోనూ నిర్ణయం తీసుకోనుంది. దీంతో.. అన్ని అంశాల పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా దశల వారీగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications