రేపే 'తల్లికి వందనం' నిధులు విడుదల, కొత్తగా వీరికీ వర్తింపు - విధి విధానాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (జూన్ 12) కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. ఈ సమయంలో సూపర్ సిక్స్ లో ముఖ్యమైన తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. గతంలోనే ప్రభుత్వం పాఠశాలల రీ ఓపెన్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తు.. వివరాల సేకరణ తరువాత రేపు (గురువారం) ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఇంటర్ చదివే విద్యార్ధులకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా అడ్మిషన్లు పొందే వారి విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు నిర్ణయం
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి సిఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు (గురువారం) తల్లులకు కానుక గా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం రోజునే ఈ నిధుల విడుదలకు నిర్ణయించారు. ఈ పథకం అమలు పైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమలు ద్వారా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నిధుల విడుదల.. అమలు కు సంబంధించి తుది విధి విధానాలతో ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయనుంది.

ap-govt-decided-to-deposit-thalli-ki-vandanam-funds-in-beneficiaries-account-on-12th-june

రేపే నిధులు
తల్లికి వందనం అమల్లో భాగంగా 67 లక్షల మందికి పథకం నిధులు ప్రభుత్వం రేపు ఖాతాల్లో జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేని ఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందు కోసం తల్లుల ఖాతాల్లో రూ 8745 కోట్లు రేపు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా.. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేసారు.

ఏడాది పాలనలో
ప్రభుత్వం ఈ పథకం రేపు విడుదల చేయటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆర్దిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో రెండు విడతలుగా ఈ పథకం అమలు పైన ఆలోచన చేసింది. అయితే, రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒకే విడతలో హామీ ఇచ్చిన విధంగా అమలుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఉత్సవాల కు సిద్దం అవుతోంది. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది కాలంలో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం అమలు అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాగా, తల్లికి వందనం విధి విధానాల జీవో విడుదల ద్వారా.. ఈ పతకం అమలు పైన మరింత స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+