పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు- ప్రభుత్వం తాజా ఆదేశాలతో..!!

ఏపీలో పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పెన్షన్ ను రూ 4 వేలకు పెంచి ప్రతీ నెలా ఒకటో తేదీన అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ నెలా స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, వితంతు.. ఒంటరి మహిళల కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక.. జూన్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అంశం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక రోజు ముందే
ప్రతీ నెలా ఒకటో తేదీన వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్ది దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు. కాగా, జూన్ 1న అందాల్సిన పెన్షన్ ను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆదివారం కావటంతో ముందు రోజునే పెన్షన్లు అందించనుంది. ఈ మేరకు మే 31న పెన్షన్ల పంపిణీకి వీలుగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మే 31న ఉదయం సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు. ఒకవేళ మే 31న డబ్బులు అందుకో లేని వారి కోసం, జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకునే అవకాశం కల్పించారు.

ap-govt-decided-to-distribute-pensions-on-31st-of-this-month

కొత్త పెన్షన్లు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో.. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12న వీరికి పెన్షన్లు పంపిణీకి ముహూర్తం ఖరారు చేసారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. వీరికి పంపిణీ దిశగా నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ ఇవ్వటం మొదలు పెట్టారు. 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సెర్ఫ్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి లబ్ది దారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. కొత్తగా పెన్షన్ల మంజూరు ద్వారా దాదాపు రూ 36 కోట్ల మేర ప్రభుత్వం పైన అదనపు భారం పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+