యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ - ఖాళీల లెక్కలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా యూనివర్సిటీ ల్లోని ఖాళీల భర్తీకి నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీకి తుది కసరత్తు చేస్తోంది. ఏపీలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాదాపు 1500 పోస్టులను భర్తీ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. యూనివర్సిటీల వారీగా ఖాళీల భర్తీకి ఆమోదం లభించింది.
ఏపీలోని పలు విశ్వ విద్యాలయాల్లో 1,523 బోధన పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈనెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. జాబ్ క్యాలెండర్‌లో 1,500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నా, బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి మరో 23 ఖాళీలనూ భర్తీ చేయనుంది. రెగ్యులర్ ఖాళీలు 1,244 ఉండగా బ్యాక్‌లాగ్‌లు 279 ఉన్నాయి. వర్సిటీలు వీటన్నింటికీ రిజర్వేషన్ రోస్టర్‌ను రూపొందించాయి. RGUKT లో 311 బోధన పోస్టులు భర్తీకి నిర్ణయించారు. కాగా, వాటిల్లో లెక్చరల్ పోస్టులు 104 ఉన్నాయి.ఆ తర్వాత ఆంధ్ర వర్సిటీలో 246, శ్రీవేంకటేశ్వరలో 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా ఆంధ్రకేసరి వర్సిటీలో 9 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ వర్సిటీ కొత్తగా ఏర్పాటు చేశారు. అందువల్ల తక్కువ కోర్సులను ప్రవేశ పెట్టారు. దీంతో బోధన పోస్టుల సంఖ్య తగ్గింది.

ఈ నెల 15న నోటిఫికేషన్
2017, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున కొన్ని ఖాళీలను మినహాయించి, మిగతా పోస్టులను భర్తీ చేస్తోంది. 2023 లో జారీ చేసిన నోటిఫికేషన్ అంశం కోర్టులో ఉండటంతో.. ఆ నోటిఫికేషన్లను వెనక్కు తీసుకున్నారు. కొత్త నోటిఫికేషన్ల జారీకి ఆమోదం లభించింది. కాగా.. టీచింగ్ స్టాఫ్ నియామకంలో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలో 5 శాతం వెయిటేజీ ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూల సమయంలోనూ 10 మార్కుల వెయిటేజీ ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. 2023 నోటిఫికేషన్ మధ్యలోనే నిలిచిపోయినందున అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి మార్గదర్శకాలతో ఈ నెల 15వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీకి నిర్ణయించారు.












Click it and Unblock the Notifications