ఇళ్ల నిర్మాణానికి రూ.1కే అనుమతులు, సడలింపులు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల విషయం లో ఫీజు రాయితీ ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు రూపాయికే అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. భవన నిర్మాణ విధి విధానాలు.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రాయితీతో పాటుగా మినహాయింపులు దక్కనున్నాయి.

పేదల ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పట్టణ ప్రాంతా ల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికే ఇక అనుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్ఠంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించింది. నివాస భవనాలకు సంబంధించి సెట్‌ బ్యాక్‌ (భవనం చుట్టూ విడిచిపెట్టే ఖాళీస్థలం)లోనూ వెసులు బాటు కల్పించింది. రెడ్‌ క్యాటగిరీ మినహా 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించింది. 100 చద రపు మీటర్ల (ప్లాట్‌) స్థలంలో నిర్మాణాలకు 2 మీటర్ల వెడల్పుగల అంతర్గత రోడ్డు, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్డు సరిపోతుంది.

ap-govt-decided-to-gives-permissions-for-house-construction-rs-1-for-poor

అదే విధంగా 100 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్‌కు ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ 1 మీటరు నుంచి 3 మీటర్లు. భవనంలో మిగిలిన మూడు వైపులకు 0.75 మీటర్ల నుంచి 2 మీటర్లు ఉంచాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్లు మొదలుకుని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ 3 మీటర్ల నుంచి ఇంచుమించు 5.5 మీటర్లు, అదే విధంగా భవనంలో మిగిలిన మూడు వైపులకు ఇప్పటివరకు ఉన్న పాత నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించారు. 2,500 చదరపు మీటర్ల పైబడిన విస్తీర్ణంలో ఉన్న ప్లాట్స్​కు కూడా 500 చదరపు మీటర్ల నుంచి 2,500 చదరపు మీటర్ల ప్లాట్‌కు ఉన్న సెట్‌బ్యాక్‌ నిబంధనలే కొనసాగనున్నాయి. 300 చ. మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్‌ పార్కింగ్‌కు అనుమతి లభించనుది. అదే ప్లాట్‌లో సెట్‌బ్యాక్‌ మార్చుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+