అమరావతి వేదికగా చంద్రబాబు తాజా నిర్ణయం - బిగ్ టర్న్..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభించే లా ఇప్పటికే కార్యాచరణ సిద్దం అవుతోంది. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీ4 కార్యక్రమం పైన తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉగాది రోజున ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమం వెనుక చంద్రబాబు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారీగా ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పీ4 కార్యక్రమం ఆరంభం
ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి అమరావతి వేదికగా నిలవనుంది. ఉగాది ముహూర్తంగా నిర్ణయించారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది నాడు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రం లోని ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ap-govt-decided-to-launch-p-4-scheme-on-ugadai-at-amaravati

అన్ని నియోజకవర్గాల నుంచి
పీ4 కార్యక్రమం రూపకల్పనలో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేసారు. విధి విధానాలు ఖరారు అయ్యాయి. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని రూపొందిం చింది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవడం తో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయటమే ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఈ పీ4 పాలసీ పైన ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు - సలహాలు స్వీకరిస్తోంది. www.swarnandhra.ap.gov.in/p4 వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వం ఏర్పాట్లు
ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేలా 11 ప్రశ్నలు ఇచ్చి వారి నుంచి సూచనలు స్వీకరిస్తోంది. పూర్తి చేసిన వారికి వారి పేర్లతో పావర్టీ - పీ4 పేరుతో ప్రశంసా పత్రం అందిస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకం గా నిర్వహించేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఉగాది రోజున అమరావతి వేదికగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోని వారికి అవకాశం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+