ఏపీలో మళ్లీ పాత మద్యం బ్రాండ్లు - ధరలు తగ్గింపు..!!

మద్యం పాలసీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీ పైన చర్చ జరిగింది. గత ప్రభుత్వ హాయంలో కనుమరుగైన పాపులర్‌ మద్యం బ్రాండ్లను పూర్తిస్థాయిలో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పేదలు తాగే తక్కువ రకం మద్యం ధరలు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించగా, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలూ తగ్గించాలని యోచిస్తోంది.

పాత బ్రాండ్లు సిద్దం
ప్రీమియం మద్యం కంపెనీలను తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవని, పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చని వాటికి భరోసా ఇచ్చింది.
గత ప్రభుత్వంలో ఎడాపెడా పన్నులు వేసి ప్రీమియం బ్రాండ్ల నుంచి చీప్‌ లిక్కర్‌ వరకు అన్ని రకాల మద్యం ధరలూ పెంచేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొంత వదులుకుని అయినా పేదలు తాగే మద్యం మరీ భారం కాకుండా చూడాలని నిర్ణయించింది. గతంలో కొన్ని బ్రాండ్లను మాత్రమే ఆ షాపుల్లో ఉంచడంతో వినియోగదారులకు మరో దారి లేకుండా పోయింది.

AP Govt decided to permit popular liquor brands sales again in the state details here

నూతన మద్యం పాలసీ
ఇప్పుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొస్తోంది. ఇందులో షాపులన్నీ ప్రైవేట్‌వి అయితే లైసెన్సీలు వినియోగదారులు ఇష్టపడే బ్రాండ్లను అందుబాటులో ఉంచుతారు. అప్పుడు వారు తమకు నచ్చిన బ్రాండ్‌నే కొనుగోలు చేస్తారు. దీంతో పాత బ్రాండ్లు క్రమంగా వాటంతట అవే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. మద్యం ధరలు ఏపీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో వాటిని తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2019కు ముందు చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ రూ.70కు కూడా దొరికేది. వైసీపీ ప్రభుత్వంలో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ ధర రూ.150 దాటింది. మీడియం రకం బ్రాండ్ల ధరలు క్వార్టర్‌ రూ.200 దాటిపోయాయి.

ధరలు తగ్గుతాయా
ధరలు పెరిగినా నాణ్యమైన మద్యం విక్రయించకపోవడంతో అటు ఆర్థికంగా, ఇటు అనారోగ్య సమస్యలతో పేదలు ఇంకా నష్టపోయారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సరిహద్దు రాష్ర్టాల ధరల స్థాయికి మద్యం ధరలు తీసుకురానున్నారు. అవసరమైతే వాటి కంటే కొంతమేర అదనంగా తగ్గించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రైవేట్‌ మద్యం షాపుల విధానం వస్తే అన్ని కంపెనీలకు న్యాయం జరుగుతుందని అంతర్జాతీయ మద్యం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. పన్నులు కొంతమేర తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వానికి సూచించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+