ఏపీలో ఉద్యోగుల బదిలీల ముగింపు వేళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తున్న వేళ అనూహ్య నిర్ణయం వెల్లడించింది. గత నెల 15వ నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలకు ఆర్థికశాఖ అనుమతిచ్చింది. ఆ గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో తాజాగా మరో వారం రోజులు పొడిగించారు. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించింది. గత నెల 15వ తేదీన ఉద్యోగుల బదిలీల పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ రోజు (జూన్ 2) వరకు తొలుత ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కు అవకాశం కల్పించింది. కాగా, ఇప్పుడు ఈ గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఇందుకనుగుణంగా అప్పటి వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాగా, కొన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియలో జాప్యంతో పాటుగా ఉద్యోగుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బదిలీలకు సంబంధించిన నిబంధనల పైన ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులు ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయితే ఖచ్చితంగా బదిలీ చేయాలని సూచించింది. అదే విధంగా ఒకే పదో న్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేస్తున్నారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇస్తూ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మెడికల్ గ్రౌండ్‌లో భాగంగా ఉద్యోగుల వినతి మేరకు బదిలీ చేయనుంది. వితంతు ఉద్యోగుల వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చింది. స్పౌజ్ ఉద్యోగులకు బదిలీల్లో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యం కల్పించింది.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications