ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మార్గదర్శకాలు - దరఖాస్తులు, అర్హులు..!!
ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నాడు ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం పైన ఏటా రూ 2,684 కోట్ల భారం పడనుంది. ఈ పథకం అమలులో భాగంగా అర్హత..దరఖాస్తు..మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.
మార్గదర్శకాలు
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటుగా అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం రేపటి నుంచి ( ఈ నెల 24) బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయి.

ఏడాదికి మూడు సిలిండర్లు
ఈ నెల 24 నుంచి బుక్ చేసుకున్న వినియోగదారులకు ఆన్ లైన్ విధానంలో ఉచిత గ్యాస్ పథకం అమలుకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉండగా.. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడనుంది. ఐదేళ్లకు రూ.13 వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు.
ఆ కుటుంబాలకే
బీపీఎల్ కుటుంబాలకు.. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతీ నెలా రేషన్ కార్డు ద్వారా నిత్యావసరాలు పొందుతున్న వారు .. స్థిర నివాసం ఉన్న వారిని అర్హులు గా నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతా లబ్దిదారుల ఆదాయ ఎంత వరకు ఉంటే అర్హులో ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ను గృహ వినియోగం కోసమే వినియోగించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి నాడు పండుగ వాతావరణంలో ఈ పథకం ప్రారంభం కానుంది. అయితే, తెల్ల రేషన్ కార్డు లేక పోయినా..దరఖాస్తు చేసుకున్న వారి విషయం లో వెసులుబాటు కలిగించాలనే డిమాండ్ పైన ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications