వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రక్షాళన - ఇతర శాఖల్లోకి మార్పు..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల ప్రక్షాళన మొదలు పెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం వార్డు -గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా భావించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సచివాయల ప్రక్షాళన దిశగా అడుగులువేస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులను ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తంది. దీని పైన ప్రభుత్వం అధికారుల నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది.

ప్రక్షాళన దిశగా
గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలను ( మౌళిక వసతుల కల్పన కార్యదర్శి) ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తోంది. ఈ రెండు విభాగాల్లో సుమారు 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్లుఎస్‌ శాఖలకు బదిలీ చేసి, ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

AP Govt Foucs on Ward Village Secretariat reshuffle and posts Adjustments

అధికారుల కసరత్తు
అభివృద్ధి కార్యాక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి అమలులో అమినిటీస్‌ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేకించి నిర్మాణ రంగానికి సంబంధించి గృహాల నిర్మాణ ప్రణాళికకు ఆమోదం మొదలుకొని నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. అలాగే మంచినీటి పైపులైన్లు, రహదారులు, కాల్వల పనుల పర్యవేక్షణ, అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరి చేయాల్సివుంది.

ఉద్యోగుల సర్దుబాటు
ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పనులు నత్తనడకనసాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన మూడు డిజిఎం , రెండు జనరల్‌ మేనేజర్లు, ఒక ఇడి పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖల్లో ఉన్న ఖాళీలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+