విజయవాడలో ఈషా ఫౌండేషన్‌కు 400 ఎకరాల భూమి: మంత్రి గంటా ప్రకటన
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సమీపంలోని విజయవాడలో ఈషా ఫౌండేషన్ కోసం 400 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఈషా ఫౌండేషన్‌కు 400 ఎకరాల భూమిని అప్పగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ స్ధలంలో ఓ అంతర్జాతీయ స్ధాయి పాఠశాలతో పాటు న్యాయ కళాశాల, శిక్షణా కేంద్రాలను ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోనుందని ఆయన తెలిపారు.

ఇంజనీరింగ్ కళాశాలల్లో గ్రేడింగ్ పద్ధతి తీసుకువస్తామని చెప్పిన ఆయన, ఈ నెల 21న హైదరాబాద్‌లో యూనివర్శిటీ యాక్టుపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ప్రైవేటు యూనివర్సటీ బిల్లుపై కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
త్వరలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఎడ్యుకేషనల్ సిటీల నిర్మాణం కోసం వెయ్యి నుంచి రెండువేల ఎకరాల భూములను కేటాయించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.












Click it and Unblock the Notifications