నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ప్రభుత్వం కీలక ఉత్తర్వులు- వీరికి వర్తించదు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీకి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఈ మేరకు ప్రాధమిక నోటిఫికేషన్ జారీకి సిద్దం అయింది. కాగా... పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేళ నిరుద్యోగులకు వమో పరిమితి సడలింపు పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరికి ఈ సడలింపు వర్తిస్తుంది.. ఎవరికి మినహాయింపు అనేది ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు అద్భుతమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయోపరిమితి సడలింపు ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ తో పాటు వివిధ నియామక సంస్థల ద్వారా చేపటే నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ఈ సడలింపు సెప్టెంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా జరిగే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. గతంలో ఉన్న 42 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మారుతున్న పవన్ లెక్కలు, కొత్త ఫార్ములా - కీలక భేటీ.. ఫైనల్ డెసిషన్..!!
మారుతున్న పవన్ లెక్కలు, కొత్త ఫార్ములా - కీలక భేటీ.. ఫైనల్ డెసిషన్..!!
ap-govt-has-issued-two-orders-increasing-the-upper-age-limit-for-recruitment-to-public-services-from

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో

కాగా, పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ వంటి యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు ఈ పెంపు వర్తించదని జీవోలో స్పష్టత ఇచ్చారు. రూల్ నంబర్ - 12 ప్రకారం కల్పించే ఇతర అదనపు వయో పరిమితి సడలింపులు యథావిధిగా వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పేర్కొన్నారు. వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు వెలువడే నోటిఫికేషన్లకు అమల్లో ఉంటుంది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ సడలింపులు యథావిధిగా వర్తిస్తాయి. యూనిఫాం పోస్టుల కు, భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు. ఆయా ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొనే నిబంధనలను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ప్రాధమిక నోటిఫికేషన్ ఈ రోజు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+