భక్తులకు గుడ్ న్యూస్, దర్శన టికెట్లు మరింత సులభంగా.. ఇక నుంచి..!!

భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దర్శనం కోసం భక్తులకు ఇక నుంచి ఇబ్బందులు తెలిగించేలా కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. దర్శనం టోకెన్ల కోసం నిరీక్షణ అవసరం లేకుండా సులభంగా పొందేలా సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందు కోసం అన్ని ప్రధాన ఆలయాల్లోనూ మార్పులు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ విధానం అమల్లోకి తీసుకు రావటం ద్వారా భక్తులకు వెసులు బాటు కలగనుంది.

ఏపీలో ప్రధాన ఆలయాల్లో భక్తులకు మరింత సులభంగా దర్శనం అందనుంది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్లను సులువుగా జారీ చేసేందుకు ముఖ్య ఆలయాల్లో కియోస్క్‌ మెషిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆలయాల్లో టచ్‌ స్క్రీన్‌ తో ఉన్న కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది.

AP govt introduce new system for Darshan tickets in All major temples

ప్రధాన ఆలయాల్లో ఏర్పాటు చేసే ఈ కియోస్క్‌ మెషిన్ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, వివిధ సేవల టికెట్లను నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. ఉద్యోగుల అవసరం లేకుండానే నేరుగా ఎన్ని టికెట్లు కావాలో ఎంటర్‌ చేసి, డిజిటల్‌ పేమెంట్‌ చేస్తే వెంటనే టికెట్లను జారీ చేస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాటు దిశగా కసరత్తు పూర్తి చేసింది.

ఏపీలోని ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో 8 చొప్పున కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. అరసవిల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ, తలుపులమ్మ, వాడపల్లి పెనుగంచిప్రోలు, మోపిదేవి, పెదకాకాని, కసాపురం ఆంజనేయ స్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, బోయకొండ గంగమ్మ ఆలయాల్లో మూడేసి కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు.

వీటి ద్వారా భక్తులు చేసిన డిజిటల్‌ పేమెంట్స్‌ జమ అయ్యేందుకు ఆయా ఆలయాల ఈవోల పేరిట కరూర్‌ వైశ్య బ్యాంకులో అకౌంట్లు ఇవ్వనున్నారు. కాగా, ఈ 100 కియోస్క్‌లను అందించేందుకు కరూర్‌ వైశ్య బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ మెషిన్ల ఇన్‌స్టాలేషన్‌, నిర్వహణ బాధ్యతలను వారే పర్యవేక్షించనున్నారు. దీని ద్వారా దర్శన టికెట్ల కోసం ఇక ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+