Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలులో హైకోర్టు బెంచ్ - కీలక పరిణామాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హై కోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు దిశగా కార్యచరణ మొదలైంది. ఈ మేరకు హైకోర్టు నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్ కు లేఖ అందింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులకు అవసరమైన సౌకర్యాల పై పూర్తి వివరాలు ఇవ్వాలని అందులో కోరారు. దీంతో, భవనాల కోసం కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇదే అంశం పై హైకోర్టులో న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసారు. జిల్లా అధికార యంత్రాంగం హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై కీలక ప్రతిపాదనలు సమర్పించింది.

వేగంగా పరిణామాలు
కర్నూలులో శాశ్వాత హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు నుంచి ఈ బెంచ్ ఏర్పాటు వసతి - సౌకర్యాల కల్పన పైన జిల్లా కలెక్టర్ కు లేఖ అందింది. దీంతో, స్పందించిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణ మొదలు పెట్టింది. న్యాయమూర్తుల వసతి.. కోర్టు నిర్వహణ వంటి వాటి పైన ఆరా తీసారు. దీంతో, ఈ వివరాలను హైకోర్టు కమిటీ ముందు ఉంచేందుకు జిల్లా కలెక్టర్ పలు శాఖల అధికారులను అప్రమత్తం చేసారు. భవనాల గురించి వివరాలు కోరారు. దీంతో, కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది వసతికి అవసరమైన భవనాల కోసం ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలించారు.

AP Govt is working on setting up of permanent Bench of High Court at Kurnool

భవనాల పై కసరత్తు
కాగా..కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నూతన భవనాన్ని సుమారు రూ.25 కోట్లతో గతేడాది అధికారులు అత్యాధు నికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థాన అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహం, అందులోని నాలు గు సూట్‌ రూములను వినియోగించుకోవచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కానీ, ఇక్కడ వినియోగం పైన ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. దీంతో.. దీంతోపాటు బి.తాండ్రపాడు లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో, సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రాంగణంలోని క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఖాళీగా ఉన్న 50 గదులను అధికారులు పరిశీలించారు.

హైకోర్టు కమిటీ
కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుపై హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో ఓ కమిటీని సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఏర్పాటు చేశారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లకు కమిటీలో స్థానం కల్పించారు. ఇప్పుడు కర్నూలు జిల్లా అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలన చేయనుంది. ఆ తరువాత ఆమోద యోగ్యంగా ఉంటే... తదుపరి కార్యాచరణ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పైన మంత్రివర్గం తీర్మానం చేసింది. కర్నూలులో వసతి .. ఇతర ఏర్పాట్లు సిద్దం అయితే.. బెంచ్ నిర్వహణ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+