Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక థియేటర్లలో టిక్కెట్లకు నో ఛాన్స్ - ఆన్‌లైన్‌ విధానంలోనే : విధివిధానాలు ఖరారు..!!

ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాల విధానం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ సినిమా నియమావళి-1970ను ప్రభుత్వం సవరించింది. సిద్ధమైంది. ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనుంది. ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలి.

నోడల్ ఏజెన్సీగా ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ

నోడల్ ఏజెన్సీగా ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ


టికెట్‌ ధరపై సేవారుసుము 2 శాతానికి మించి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి సర్వీసు ప్రొవైడర్‌ను నియమించే, నిర్వహణ చేపట్టే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి అప్పగించింది. ఆ సంస్థే నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న సంస్థలు, సినిమా థియేటర్లు ఆ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. అయితే నోడల్‌ ఏజెన్సీ నియమించిన సర్వీసు ప్రొవైడర్‌ గేట్‌వే ద్వారానే విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Recommended Video

    Vikram Movie Genuine Review | Telugu Oneindia
    నిర్లక్ష్యం చేస్తే లైసెన్సు రద్దు

    నిర్లక్ష్యం చేస్తే లైసెన్సు రద్దు


    ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల కోసం రాష్ట్రంలోని సినిమా థియేటర్లన్నీ ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. 30 రోజుల్లోగా అన్ని థియేటర్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరు నిర్లక్ష్యం చేసినా లైసెన్సు రద్దు అవుతుందని హెచ్చరించింది. ప్రతి టికెట్‌పైనా.. జీఎస్టీ, సేవారుసుము ఎంత వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా ముద్రించాలని నిర్దేశించింది. సినిమా తొలి ప్రదర్శనకు ఏడు రోజుల ముందు నుంచి మాత్రమే ఆన్‌లైన్‌ విక్రయాలు ప్రారంభించాలని విధి విధానాల్లో స్పష్టంగా పేర్కొంది.

    ఆన్ లైన్ విధానంలోనే అమ్మకాలు

    ఆన్ లైన్ విధానంలోనే అమ్మకాలు


    గతంలోనే ప్రభుత్వం ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల విక్రయాల పైన నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత తీసుకొస్తామని చెబుతూ వచ్చింది. అదే విధంగా భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరల పైనా ఇప్పటికే ప్రభుత్వం జీవో ద్వారా విధి విధానాలు వెల్లడించింది. ఆ తరువాత విడుదలైన కొత్త సినిమాలకు వారం నుంచి రెండు వారాల వరకు టిక్కెట్ ధరలు పెంచుకొనే అవకాశం కల్పిస్తూ వెసులుబాటు కలిగించింది. ఇక, ఇప్పుడు ఆన్ లైన్ టిక్కెట్ల విధానం అమలు ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+