అమరావతిలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం - గెజిట్ నోటిఫికేషన్ జారీ..!!

అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన ఆర్​5 జోన్ పైన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ‌తంలో ఉన్న జోన్ల‌లో కొన్ని భాగాల‌తో కొత్తగా R-5 జోన్ ఏర్పాటు చేసింది స‌ర్కార్. కోర్టు ఆదేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జోన్ ఏర్పాటుచేసిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా పేద‌ల ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టడంతో పాటు అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో నిర్మాణాలు చేప‌ట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా జోన్ ఏర్పాటు చేసింది.

అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేసన్​ విడుదల చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గుంటూరు, విజయవాడ నగరాలకు చెందిన దాదాపు 28 వేల మందికి ప్రస్తుతం ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చిన గ్రామాలలో గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించింది.

AP Govt issues Gazette Notification on R5 Zone in Amarvati Capital Region, farmers are opposing

దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంత‌ రాలు, ఆ త‌ర్వాత కోర్టు క్లియ‌రెన్స్‌తో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది.ప్రభుత్వం తాజాగా అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది. ఈ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టాలి, ఏవి చేప‌ట్టకూడ‌ద‌నే వివ‌రాల‌న్నీ గెజిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

స‌ర్వీస్ అపార్ట్‌మెంట్స్, ఇండ‌స్ట్రియ‌ల్ అవ‌స‌రాల కోసం, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు అనుమ‌తులు ఇవ్వకూడ‌ద‌ని జీవోలో పేర్కొంది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల వంటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి పైగా పేదలకు అమరావతిలో సెంటు చెప్పిన ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీని పైన స్థానికులు హైకోర్టులో సవాల్ చేసారు. గతంలో గ్రామ సభల్లో ఈ ప్రతిపాదన లకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసారు. న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో సవరణ చేయటం..తాజాగా గెజిట్ జారీ చేయటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+