ఏపీలో అమల్లోకి మరో ఎన్నికల హామీ - ఇక ఉచితంగా..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా పథకాలు.. హామీల అమలు పైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభం కాగా.. ఈ నెలలో అన్నదాత సుఖీభవ తో పాటుగా 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరో ఉచిత పథకం అమల్లోకి తీసుకొచ్చింది.

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచే మగ్గం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సవిత. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలు కు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పర్యటించారు చేనేతల ఉచిత విద్యుత్ అమలుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ap-govt-issues-guide-lines-for-implementation-of-free-power-to-weavers

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంధన శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయాలని తొలుత నిర్ణయించింది. చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించినా, లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. ఒక వేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే, అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+