ఏపీ ప్రభుత్వం సంచలనం - చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ ..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీడీపీ అధినేత కరకట్టపైన ఉంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా 1944 సవరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో అమరావతి కేంద్రంగా జరిగిన భూ కుంభకోణం పైన ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదులపై సీఐడీ విచారణ చేసింది. ఆర్దిక అక్రమాలు..ఉల్లంఘనలు జరిగాయని నిర్దారణతో ఆస్తులను అటాచ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అమరావతిలో అనేక అక్రమాలు జరిగామని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసారు. మంత్రిగా నారాయణ అమరావతి బాధ్యతలను పర్యవేక్షించే సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యులకు లబ్ది కలిగేలా క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన విచారణ జరిగింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే కోణంలో విచారణలో చేసారు. అందులో భాగంగా నాటి ప్రభుత్వంలోని ముఖ్యులు కరకట్ట పైన లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగం.

చట్టాలను, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలు..సాధారణ ఆర్ధిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. తమ పదువలను ఉపయోగించుకుని కావాల్సిన వారికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారనే అభియోగాలు ఉన్నాయి. లింగమేనేనికి అనుకూలంగా నాటి ప్రభుత్వం అమరావతిలో వ్యవహరించిన కారణంగానే ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని పైన విచారణ చేసిన సీఐడీ తాజాగా ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ యాక్ట్ 1944 ప్రకారం ఎటాచ్ చేయాలని కోరింది. ప్రభుత్వం ఈ మేరకు లింగమనేని గెస్ట్ హౌస్ ను ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ ఎటాచ్ మెంట్ కు అనుగుణంగా జీవో జారీ చేసింది.












Click it and Unblock the Notifications
