57వెటర్నిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
వెటర్నిటీ అసిస్టెంట్ కు సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఆనిమల్ హజ్బెండరీ (జంతు నిర్వహణ సంస్థ) విజయవాడ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం
పోస్టులు
:
57
పోస్టు
పేరు
:
వెటర్నిటీ
అసిస్టెంట్
నిర్ణీత వయసు : జులై01, 2016 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది.
విద్యార్హతలు : దేశంలోని ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వెటర్నిటీ సైన్స్ లేదా ఏనిమల్ హజ్బెండరీ లేదా తత్సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం : నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును ఎన్వలప్ ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఆనిమల్ హజ్బెండరీ విజయవాడ వారికి నవంబర్ 28, 2016 సాయంత్రం 5గం. లోపు చేరే విధంగా పంపించాలి.
చివరి తేదీ : నవంబర్ 28, 2016 సాయంత్రం 5గం. లోపు