ఆధార్ అప్‌డేట్..వీరికి తప్పనిసరి- ప్రత్యేక శిబిరాలు, ఇలా చేయండి..!!
ఆధార్ సేవల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్ధుల ను గుర్తించి.. పాఠశాలల్లోనే అప్డేట్ చేసే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించాలని నిర్దేశించింది.
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 26 వరకు రాష్ట్రంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించను న్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు 16,51271 మంది ఉండగా, అందులో ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల్లో 1,04,776 మంది బయో మెట్రిక్ నమోదు చేయించుకున్నారు. ఇంకా 15,46,495 చిన్నారులు చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించాలని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం.. అప్డేట్ చేసుకోని మిగిలిన విద్యార్ధుల కోసం ఈ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టరేట్‌కి స్పష్టమైన శాలు జారీ చేసింది. ఆర్డీవోలు, డీఎల్‌డీవోలు పర్యవేక్షణలో ఈ శిబిరాలు జరగాలని నిర్దేశించిన ప్రభుత్వం..నూరుశాతం ఆధార్ నమోదు, నవీకరణ పూర్తి చేయడం లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేసింది. దీని ద్వారా ఆధార్ కార్డులు లేని వారు.. అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నవారికి వెసులుబాటు కలగనుంది. ఆధార్ నమోదు, నవీకరణ కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం, ఫొటో, పత్రాల స్కానింగ్ వంటి అంశాల్లో వారికి అవగాహన కల్పించారు. కాగా, నాలుగు రోజులపాటు ఎలాంటి అంతరాయం లేకుండా శిబిరాలు కొనసాగించేలా ప్రణాళికలు సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications