మందుబాబులకు బిగ్ అలర్ట్: నకిలీ మద్యం ఇలా గుర్తించండి..!!
ఏపీలో నకిలీ, కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కొనుగోలు చేస్తున్న మద్యం అసలుదో, నకిలీదో సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా యాప్ ను ఆవిష్కరించింది. సింపుల్ విధానాలతో ఎలాంటి అనుమానాలు లేకుండా మద్యం నాణ్యత తెలుసుకునే అవకాశం కల్పించారు. దీని ద్వారా మద్యం కొనుగోలు దారుల్లో సందేహాలకు అవకాశం లేకుండా నిర్ణయం అమలు చేస్తోంది.
మద్యం నాణ్యత గుర్తించేందుకు వీలుగా సీఎం చంద్రబాబు 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' పేరుతో ఓ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తాము కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు.

మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయగానే, ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు. బాటిల్ సీల్, ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, ఏ డిస్టిలరీలో తయారైంది, తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవేళ స్కాన్ చేసినప్పుడు 'ఇన్ వాలిడ్' (చెల్లనిది) అని వస్తే, ఆ మద్యం బాటిల్ నకిలీదని సులభంగా గుర్తించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.
భవిష్యత్తులో ఈ యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా, ప్రజలను మోసం చేసేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ యాప్ పనిచేసే తీరుపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈనెల 16 నుంచి అన్ని మద్యం షాపుల్లో సురక్ష యాప్ అమల్లోకి వస్తుంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసిన సీసాలను స్కాన్ చేసి పరిశీలించాలి.
ఏవైనా ఫిర్యాదులుంటే 14405 నంబరుకు కాల్ చేసి చెప్పవచ్చు. షాపులో స్కాన్ చేసిన తర్వాత దానిని బెల్టులకు పంపినా తెలిసిపోతుంది. దీని ద్వారా ప్రస్తుతం కల్తీ మద్యం గుట్టు రట్టు అవ్వటంతో మద్యం తీసుకునే వారిలో ఎలాంటి సందేహాలకు అవకాశం లేకుండా తెలిగించేందుకు ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా మద్యం నాణ్యత పైన పూర్తి స్పష్టత వినియోగదారుడికి రానుంది.












Click it and Unblock the Notifications