రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!
ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది. అదే సమయంలో మహిళలకు మరిన్ని కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాసాంధ్ర భరోసా పథకం ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి పని చేస్తున్న వారికి బాటసగా నిలవటమే లక్ష్యంగా రూపకల్పన చేసారు.
ఏపీ ప్రభుత్వం వరుస పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. 'ప్రవాసాంధ్ర భరోసా' పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెబుతున్నారు. దీని ద్వారా ఏపీ నుంచి వెళ్లి అక్కడ స్థిర పడిన ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చారు.
ఎవరి పేరుతో భీమా చేసారో..ఆ వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగిన రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
మరిన్ని వివరాల కోసం 24/7 అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్ 91 863 2340678, వాట్సాప్ నెంబర్ 91 85000 27678 లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. అదే విధంగా అమలు చేస్తున్న పథకాల పైన ప్రజా స్పందనను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా మార్పులకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications