ఏపీలో ఇంటర్ పరీక్షల ముహూర్తం ఖరారు..!!
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దాదాపు ఖరారైంది. పరీక్షల నిర్వహణ పైన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని అధికారుల ప్రతిపాదన చేసారు. మార్చి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రతిపాదించారు. ఇప్పటికే పరీక్షా ఫీజుల గడువు ముగియటంతో తాజా ప్రతిపాదనల పైన చర్చించిన తరువాత ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల దాదాపు సిద్దమైంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రతిపాదనల పై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారుల సూచనలకు ఆమోద ముద్ర వేస్తే మార్చి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి.

అధికారులు ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచి 20 వరకూ నిర్వహించనున్నారు. పర్యావరణం, మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జగరనున్నాయి. ఈ తేదీల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 21వ తేదీతో ఇంటర్ ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. రూ.1000 ఆలస్య రుసుముతో ఇచ్చిన గడువు డిసెంబర్ 5వ తేదీతో ముగిసింది. వచ్చే వారం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications