పవన్ టీంలోకి అమ్రపాలీ - కీలక బాధ్యతలు..!?

ఐఏఎస్ అమ్రపాలీ ఏపీలో విధులు నిర్వహించనున్నారు. అమ్రపాలీని ఏపీలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాల పైన న్యాయ పోరాటం చేసారు. క్యాట్.. ఆ తరువాత హైకోర్టులోనూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం అమ్రపాలీని రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వంలో అమ్రపాలీకి దక్కే పోస్టు పైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీంలోకి అమ్రపాలీని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.

ఏపీలో పోస్టింగ్స్
ఐఏఎస్ అధికారి అమ్రపాలీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు నిర్వహించనున్నారు. విశాఖ తన స్వస్థలంగా అమ్రపాలీ డీఓపీటీకి ఇచ్చిన వివరాల్లో పేర్కొనటంతో ఏపీకి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వలు వెలువడ్డాయి. తెలంగాణలో పని చేస్తున్న అమ్రపాలీని ఏపీకి కేటాయించటంతో న్యాయ పోరాటం చేసారు. అమ్రపాలీతో సమా మిగిలిన అధికారులు క్యాట్, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందుగా డీఓపీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు కేటాయించిన ప్రాంతంలో విధుల్లో చేరాలని..ఆ తరువాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో, తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అమ్రపాలీతో సహా ఇతర అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు.

AP Govt likely to post IAS Amrapali in Dy CM Pawan Kalyan team as reports

పవన్ టీంలోకి వెళ్తారా
అమ్రపాలీ చురుకైన అధికారిగా పేరు ఉంది. దీంతో, ప్రభుత్వం కేంద్రం నుంచి రప్పించి కీలకమైన జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది. గతంలో ప్రధాని కార్యాలయంలోనూ అమ్రపాలీ పని చేసారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించే వారు. ఇప్పుడు ఏపీకి కేటాయించటంతో అమ్రపాలీ సేవలు తన శాఖల్లో వినియోగించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. అదే విధంగా కేరళ్ కేడర్ కు చెందిన అధికారి మైలవరపు కృష్ణతేజను పట్టు బట్టి తన టీంలో చేర్చుకున్నారు. ఇప్పుడు అమ్రపాలీ విషయంలోనూ అదే విధంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

సీఎస్ కు రిపోర్ట్
పవన్ వద్ద ఇప్పుడు పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు ఉన్నాయి. అమ్రపాలీకి ఏపీలో పోస్టింగ్ ఈ శాఖల్లోనే ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ రిలీవ్ చేసిన అధికారులు ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేసారు. ప్రస్తుతం హర్యానాలో ఉన్న సీఎం చంద్రబాబు, పవన్ అమరావతికి తిరిగి వచ్చిన తరువాత తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన అధికారుల పోస్టింగ్స్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ప్రత్యేకించి అమ్రపాలీకి కేటాయించే పోస్టింగ్ ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+