తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం, అర్హుల జాబితా - ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం రెండో విడత నిధుల జమ తేదీ పైన స్పష్టత వస్తోంది. ప్రభుత్వం తొలుత ఈ నెల 17,18,19 తేదీల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) సమావేశాల సందర్భంగా లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయాలని భావించింది. అయితే, ఇప్పుడు ఆ కార్యక్రమం వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారు చేసింది. కాగా.. అర్హుల జాబితా పైనాకీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత ఈ నెల 17,18,19 తేదీల్లో నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్దం చేసింది. అయితే, తాజాగా కొన్ని కారణాల వలన అదే సమయంలో నిర్వహించాల్సిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తల్లికి వందనం నిధులు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలుచేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలుచేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథ కం వర్తించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు.

నిధుల విడుదల పైన కసరత్తు
కాగా, గత ఏడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ నిధులు వేర్వేరుగా అందుతాయి. ఇందుకోసం సుమారుగా రూ.9వేల కోట్లు అవసరం కానున్నాయి. ప్రభుత్వం ఏడాదికి 67 క్షల మందికిపైగా పథకాన్ని అమలు చేస్తోంది. స్టూడెంట్ కిట్‌లో కొన్ని వస్తువులు ఇస్తారు. యుద్ధం కారణంగా కిట్ల తయారీ ధరలు పెరిగిపోవడం వల్ల పంపిణీ ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం నిధులు జమకు ఆర్దిక శాఖ సమాయత్తం అవుతోంది. విద్యాశాఖ లబ్ది దారుల వివరాలు.. కావాల్సిన నిధుల పైన నివేదిక ఇవ్వటంతో.. ఇక, అధికారికంగా అర్హుల జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. జాబితాలో పేరు లేకపోయినా నమోదు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. నిధుల జమ తేదీకి బ్యాంకు ఖాతా.. అవసరమైన పత్రాలతో పాటుగా బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 22న దాదాపుగా నిధుల విడుదలకు అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications